రానా తో రవి తేజ.. సెట్ అవుతాడా ?

0
406
Rana and Ravi Teja in Vikram Vedha Remake
Rana and Ravi Teja in Vikram Vedha Remake

తెలుగులో స్టార్ హీరోలు ఈ మధ్య రీమేక్ సినిమాలను తెగ చేస్తున్నారు. కెరీర్ కష్ట కాలంలో ఉన్నప్పుడు రికవర్ అవ్వాలంటే రీమేక్ కథలు టానిక్ లా వాడుకొని మంచి ఎనర్జీతో మళ్లీ ఫామ్ లోకి వస్తున్నారు. అయితే ఒక్కోసారి కొన్ని కథలు ఒరిజినల్ లాంగ్వేజ్ లో హిట్ అయినా రీమేక్ లో మాత్రం అంతగా హిట్ అవ్వడం లేదు. దర్శకులు అందుకే రీమేక్ కథలను తెరకెక్కించాలంటే కొంచెం భయపడతారు.

ఇక అసలు విషయానికి వస్తే తమిళ్ లో భారీ హిట్ అందుకున్న మల్టి స్టారర్ చిత్రం విక్రమ్ వేదా ఇప్పుడు టాలీవుడ్ లో రీమేక్ అవ్వనుంది. మాధవన్ – విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమా 11 కోట్లతో తెరకెక్కి 75 కోట్లను రాబట్టింది. దీంతో పరభాషా నటులు ఆ కథపై కన్నేశారు. టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా ఈ సినిమా లో నటించే హీరోలపై అనేక రూమర్స్ వస్తున్నాయి. వెంకటేష్ – నాగార్జున అండ్ రానా అంటూ అనేక మంది హీరోల పేర్లు వినిపించాయి.

అయితే ఇప్పుడు మరొక జంట పేరు వినిపిస్తోంది. రానా అండ్ మాస్ మాహా రాజా రవి తేజ ఫైనల్ అయినట్లు టాలీవుడ్ లో టాక్. రీసెంట్ గా రాజా ది గ్రేట్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన రవి తేజ అయితేనే కరెక్ట్ గా సెట్ అవుతాడని భావించారట. మరి వీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కాకపోతే ఒకే ఫ్రేములో మాధవన్ అండ్ విజయ్ సేతుపతి సెట్టయినట్లు రానా అండ్ రవితేజ సెట్టవుతారా? ఆ విషయం ఒకసారి ఫోటో షూట్ చేస్తే కాని తెలియదేమో.