ఈ నగరానికి ఏమైంది? అంటున్న వెంకీ

0
467
Venkatesh Teja movie title Ee Nagaraniki Emaindi
Venkatesh Teja movie title Ee Nagaraniki Emaindi

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ నలుగురు హీరోల గురించి స్పెషల్ గా చెప్పుకునేవారు. అందులో వెంకటేష్ కుడా ఉండేవారు. ఇప్పటికీ ఆయన స్టార్ హీరోనే.. కాకుంటే అయన సినిమాలు ఇప్పుడు అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వడం లేదు. అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ హీరో సరికొత్త చిత్రం తో రావాలనుకుంటున్నాడు.

చివరగా గురు సినిమాతో వచ్చిన వెంకీ చాలా కాలం బ్రేక్ తీసుకున్నాడు. ఈ మధ్యనే ఆత్యాద్మిక యాత్రలు కూడా చేశాడట. అయితే మొన్నటి వరకు వెంకీకి చాలా కథలు వచ్చాయి. ఏ సినిమాను పట్టాలెక్కించాలనే విషయం పై చాలా ఆలోచనలు జరిపి చివరగా తేజ చెప్పిన ఒక స్టోరీని సెట్స్ పైకి తీసుకువెళ్లేందుకు సిద్దమయ్యాడు. నవంబర్ 16న మొదలు పెట్టి సినిమాను బ్రేక్ లేకుండా పూర్తి చెయ్యాలని అనుకుంటున్నాడట. అయితే రీసెంట్ గా ఆ సినిమాకి ఒక టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారట.

‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి సినిమాకి ముందు ఈ నగరానికి ఏమైంది అనే డైలాగ్ తో వచ్చే యాడ్ గురించి అందరికి తెలిసిందే. సినిమాల్లో కూడా ఈ ఆ డైలాగ్స్ పై స్పూప్ లు చాలానే వస్తుంటాయి. ఇక సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి తేజ ఏ విధంగా చూపిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించడానికి రెడీ అవుతున్నారు.