అబ్బే.. రోటీనమ్మా..

0
412
Veere Di Wedding First Look
Veere Di Wedding First Look

బాలీవుడ్ ఇండస్ట్రిలో ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే చాలా వరకు ఆ సినిమాకు సంబందించి ఎదో ఒక న్యూస్ వారానికోసారి హల్చల్ చేస్తూనే ఉంటుంది. సినిమా యూనిట్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎదో ఒక న్యూస్ చెప్పి సినిమాకి హైప్ తెస్తూనే ఉంటారు. షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి ఎండ్ అయ్యేవరకు బాలీవుడ్ లో ప్రమోషన్స్ జరిగినట్టుగా ఎక్కడా జరగవనే చెప్పాలి.

అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో ఒక సినిమా మాత్రం షూటింగ్ దశలో ఉండగానే భారీ క్రేజ్ తెచ్చుకుంటోంది. నలుగురు నటీమణులు ప్రధాన తారాగణంతో తెరకెక్కుతోన్న వీర్ ది వెడ్డింగ్ సినిమా యూనిట్ కొన్ని రోజుల క్రితం ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి బాగానే ఆకట్టుకుంది. కానీ ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మాత్రం అస్సలు బాలేదని సినీ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. కరీనా కపూర్ – సోనమ్ కపూర్ తో పాటు స్వర భాస్కర్ – శిఖా తల్సానియా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

రొమాంటిక్ అండ్ కామెడీ తరహాలో శశాంక్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే సినిమా ఫస్ట్ లుక్ మాత్రం అంతగా బాగాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నలుగురు తారలు ఒక్కొక్కరు ఒక్కో హావభావాలతో కనిపిస్తున్న ఆ ఫొటో రెగ్యులర్ గా కనిపించే పోస్టర్ లానే ఉందని అంటున్నారు. టీజర్ పోస్టర్లో గ్లామర్ తో అదరగొట్టేసి.. ఇక్కడ ఫస్ట్ లుక్ లో మాత్రం తొక్కేస్తే ఎలా? అనే కామెంట్ వినిపిస్తోంది.  వచ్చే ఏడాది మే 18న  రిలీజ్ కానున్న ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.