రాశి ఖన్నాతో లండన్ ట్రిప్ ఓవర్

0
480
Varun Tej And Raashi Khanna Completed London Schedule
Varun Tej And Raashi Khanna Completed London Schedule

ఫిదా సినిమాతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకొని మంచి ఖుషి లో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా ను కూడా అదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. బాబాయ్ హిట్టు సినిమా తొలి ప్రేమ టైటిల్ ని తన సినిమాకు సెట్ చేసుకొని  విదేశాల్లో షూటింగ్ మొదలు పెట్టాడు. అయితే చిత్ర యూనిట్ గత కొన్ని రోజులుగా లండన్ లో తీరిక లేకుండా షూటింగ్ జరుపుకొంది.

ఫైనల్ గా విదేశీ షెడ్యూల్ ఇటీవల ముగియడంతో చిత్ర యూనిట్ స్వదేశానికి తిరుగు ప్రయాణమైంది. ఈ విషయాన్ని హీరో వరుణ్ తేజ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులకు తెలియజేశాడు. అంతే కాకుండా వరల్డ్ ఫెమస్ గా చెప్పబడే డీజే మార్ష్ మాలో తో ఒక ఫొటో దిగి షేర్ చేశాడు. ఆ ఫొటోలో హీరోయిన్ రాశి ఖన్నా కూడా ఉంది. ఫైనల్ గా చాలా ఎంజాయ్ చేస్తూ లండన్ షెడ్యూల్ ను ముగించామని చిత్ర యూనిట్ కి కృతజ్ఞతలు చెప్పాడు వరుణ్.

తొలి ప్రేమ సినిమాను యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా ప్రముఖ నిర్మాత బివిఎస్ ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మే నెలలో సినిమాను రిలిజ్ చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తోంది.