మెగాస్టార్ ప్రోగ్రాంకు కళ తెచ్చిన తాప్సీ

0
812
Taapsee Pannu with Amitabh Bachchan on KBC9
Taapsee Pannu with Amitabh Bachchan on KBC9

నార్త్ నుంచి వచ్చి తన అందంతో సౌత్ ప్రేక్షకుల మనసును దోచుకున్న భామ తాప్సీ పన్ను. మొదటి సినిమాతోనే ఘాటు అందాలతో ప్రేక్షకులకు పరిచయం అయిన తాప్సి ఎక్కువగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. పరువాలు బాగానే ఉన్నా కూడా ఏ పిలుపు అందలేదు. అప్పుడపుడు ఛాన్సులు అందుకున్నా కూడా సెకండ్ హీరోయిన్ గానే పలకరించింది.

అయితే ఇటీవల సౌత్ లో ఆనందో బ్రహ్మ సినిమాతో లీడ్ రోల్ లో కనిపించి పర్వాలేదు అనిపించింది. ఇక బాలివుడ్ లో జూడ్వా 2 సినిమలో ఛాన్స్ దక్కించుకొని ఎవరు ఉహించని విధంగా బికినీలో షాక్ ఇచ్చింది. ప్రస్తుతం అమ్మడికి బాలీవుడ్ లో కొన్ని ఆఫర్స్ కూడా అందుతున్నాయట. బికినీ అందాలతో అక్కడా స్టార్ హోదాని బాగానే సంపాదించుకుంటోంది. ఇక అసలు విషయానికి వస్తే అమ్మడు ఇటీవల బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కౌన్ బనేగా క్రోర్ పతి (కేబిసి) షోకు స్పెషల్ గెస్ట్ గా వెళ్లింది.

షోకి అమ్మడు తన చిరునవ్వుతో కళ తెచ్చిందనే చెప్పాలి. తన సొట్ట బుగ్గల నవ్వుతో అక్కడున్న వారిని చాలా ఆకర్షించింది. అలాగే కంటెస్టెంట్స్ తో కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడి ఫొటోలకు పొజిచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ అమితాబ్ ని కలిసినందుకు చాలా సంబరపడిపోయింది. షోలో తాప్సి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.