పోర్న్ స్టార్ గా కెరీర్ ప్రారంభించి ఎరోటిక్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టి కొద్దికాలంలోనే ప్రేక్షకుల గుండెలు కొల్లగొట్టేసింది సన్నీ లియోన్. ఐటం సాంగయినా.. రొమాంటిక్ సాంగయినా సన్నీ కనిపిస్తే కుర్రాళ్లు మైమరిచిపోయి చూస్తున్నారు. సన్నీ కూడా వెండితెరపై అందాలను ధారాళంగా ఆరబోయడంలో ఏ మాత్రం మొహమాట పడకుండా అభిమానులను ఆశలను సంతృప్తి పరుస్తూనే ఉంది.

తాజాగా సన్నీలియోన్ సల్మాన్ సోదరుడు ఆర్బాజ్ ఖాన్ తో కలిసి తేరా ఇంతజార్ అనే సినిమాలో నటించింది. వీరిద్దరిపై చిత్రీకరించిన ఖాలీ ఖాలీ దిల్ అనే పాట రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ పాటలో తెల్లటి బీచ్ ఒడ్డున బికినీలో కనిపించిన సన్నీ అందాన్ని చూస్తే ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. ఈ మధ్య పెద్దగా సినిమాలు ఏవీ చేయని ఆర్బాజ్ ఖాన్ చాలా రోజుల తర్వాత రొమాంటిక్ జోనర్ లో కనిపించడం విశేషం. ఇంటిమేట్ సీన్లలో ఎప్పటిలాగే సన్నీలియోన్ చూసేవాళ్ల గుండెల్లో సెగలు పుట్టించింది. ఈ పాటకు ఆర్మాన్ మాలిక్ వాయిస్ మరింత ప్లస్సయ్యిందనే చెప్పాలి.

సన్నీలియోన్ కు ఒక్క బాలీవుడ్ లోనూ కాదు.. మన దగ్గర క్రేజ్ బాగానే ఉంది. ఇప్పటికే మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ సినిమాలో సన్నీ ఓసారి తెలుగు తెరపై కనిపించింది. తాజాగా రాజశేఖర్ హీరోగా నటించిన పి.ఎస్.వి.గరుడవేగ 126.18ఎం సినిమాలోనూ సన్నీ ఐటం సాంగ్ చేసింది. ఈ సినిమా యూనిట్ కూడా సన్నీ లియోన్ సాంగ్ ను బాగా ప్రమోట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అవును మరి ఎంతయినా సన్నీలియోన్ క్రేజే వేరు.