హీరో అవతారం ఎత్తేసిన మరో కమెడియన్

0
638
Shakalaka Shankar Driver Ramudu First Look
Shakalaka Shankar Driver Ramudu First Look

టాలీవుడ్లో కమెయడిన్లు హీరోలయ్యే ట్రెండు కొనసాగుతోంది. తాజాగా షకలక శంకర్ సైతం హీరో అయిపోయాడు. అతను కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా ఇప్పటికే షూటింగ్ కూడా జరుపుకుంటోంది. ఆ సినిమాకు ‘డ్రైవర్ రాముడు’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన ‘డ్రైవర్ రాముడు’ టైటిల్ ను వాడుకోవడమే కాదు.. అచ్చం ఎన్టీఆర్ లాగా తయారయ్యాడు షకలక శంకర్. అతడి గెటప్ బాగానే ఉంది ఈ చిత్ర పోస్టర్లో. సినిమా పీపుల్ అనే కొత్త సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాజ్ సత్య అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు షకలక శంకర్. దీంతో పాటుగా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లను ఇమిటేట్ చేస్తూ స్టేజ్ షోలు కూడా చేశాడు. ‘జబర్దస్త్’ అతడికి ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. ఈ షో ద్వారా వచ్చి సినిమాల్లో బాగా క్లిక్ అయిన వాళ్లలో షకలక శంకర్ ఒకడు. ‘రాజు గారి గది’.. ‘ఆనందో బ్రహ్మ’ లాంటి హార్రర్ కామెడీ సినిమాల్లో షకలక శంకర్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. కమెడియన్గా బిజీ అవుతున్న సమయంలోనే అతను హీరో అయ్యాడు. ఆల్రెడీ తెలుగులో సునీల్ కామెడీ నుంచి హీరో వేషాలకు మారి ఆ పాత్రల్లోనే కొనసాగుతున్నాడు. శ్రీనివాసరెడ్డి కూడా అప్పుడప్పుడూ హీరోగా పలకరిస్తున్నాడు. గత ఏడాదే సప్తగిరి కూడా హీరో అయ్యాడు. ఇప్పుడు షకలక శంకర్ కూడా ఆ బాటలోనే సాగుతున్నాడు.