షాకింగ్.. ‘2.0’ సినిమాలో ఒకటే పాట

0
277
Robo 2.0 Movie Contains One Song
Robo 2.0 Movie Contains One Song

శంకర్ సినిమాల్లో పాటలకుండే ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎంత సీరియస్ సబ్జెక్టుతో సినిమా తీసినా.. అందులో పాటలకు ప్రయారిటీ ఇస్తాడు శంకర్. చాలా భారీగా పాటలు తీయడం ఆయనకు అలవాటు. ఒక మీడియం రేంజి సినిమాకు అయ్యేంత ఖర్చు పాటలకే పెట్టిస్తుంటాడు శంకర్. పాటలంటే ఆయనకు అంత ప్రీతి. ‘రోబో’ లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలోనూ ఎంత బాగా పాటల్ని పొందుపరిచాడో తెలిసిందే. కానీ దీని సీక్వెల్ కాని సీక్వెల్ ‘2.0’లో మాత్రం ఒక్కటంటే ఒక్క పాటే ఉంటుందట. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమానే స్వయంగా వెల్లడించాడు.

‘2.0’ కోసం తాను మూడు పాటల్ని స్వరపరిచినట్లు రెహమాన్ తెలిపాడు. కానీ సినిమాలో ఉండేది మాత్రం ఒకటే పాట అన్నాడు. మిగతా రెండు పాటల్ని తాను ‘2.0’ ఆడియో వేడుకలో లైవ్ పెర్ఫామ్ చేస్తానని చెప్పాడు. మరి శంకర్ సినిమా అంటే భారీతనంతో కూడిన పాటలు ఆశించి వచ్చే అభిమానులకు ఒక్క పాటే ఉండటం నిరాశ కలిగించదా అన్నది సందేహం. ఐతే ఎన్నడూ లేనిది ‘2.0’కు మాత్రమే శంకర్ ఇలా చేస్తున్నాడంటే.. అందుకు కారణం లేకుండా పోదు. సినిమాలో అంత ఇంటెన్సిటీ ఉండి ఉండొచ్చు. పాటలు స్పీడ్ బ్రేకర్లు అవుతాయని అనిపించి ఉండొచ్చు. మరి శంకర్ ఒక్క పాటతో ఎలా జస్టిఫై చేస్తాడో చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానున్న సంగతి తెలిసిందే.