రామ్ చరణ్ చేస్తోంది అదొక్కటేనట

0
694
Ram Charan Clarity On About his Upcoming Movie
Ram Charan Clarity On About his Upcoming Movie

వచ్చే సంక్రాంతికి రంగస్థలం 1985 సినిమాతో ఎంటర్టయిన్ చేయనున్నాడు మెగా పవర్ స్టార్. అయితే  ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా లేదంటే సమ్మర్ లో వస్తుందా అనే విషయంపై మాత్రం ఇంకా పెద్దగా క్లారిటీ లేదు. కాని విషయం ఏంటంటే.. ఈ సినిమా తరువాత చరణ్ ఏం చేస్తున్నాడు అంటూ చాలా కథలు వినిపిస్తున్నాయి.

అసలు సుకుమార్ సినిమా పూర్తవ్వగానే చరణ్ వెంటనే.. బోయపాటి శ్రీను డైరక్షన్లో సినిమాను చేస్తాడని ముందులో వార్తలొచ్చాయి. దాని సంగతి పక్కనెడితే ఇప్పుడేమో పైసా వసూల్ సినిమాతో నష్టపోయిన భవ్య క్రియేషన్స్ వారిని చరణ్ కాపాడతాడని.. వారితో క్రిష్ డైరక్షన్లో ఒక సినిమాను చేస్తున్నాడని అన్నారు. ఇందులో నిజానిజాలు ఏమున్నాయా అని చూస్తే.. అసలు చరణ్ తో ఇప్పటివరకు క్రిష్ కాని.. భవ్య ఆనంద్ ప్రసాద్ కాని సంప్రదింపులే జరపలేదట. ఆ న్యూస్ వట్టి రూమర్ అని తెలుస్తోంది.

ప్రస్తుతానికి రామ్ చరణ్ కేవలం బోయపాటి శ్రీను డైరక్షన్లో మాత్రమే సినిమాను చేస్తున్నాడట. డివివి దానయ్య నిర్మాత గా రూపొందే  ఈ సినిమాను సంక్రాంతికి లాంచ్ చేసి.. వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేస్తారని టాక్. అది సంగతి.