2.0 ఆడియో.. ఎల్ ఈడీ స్క్రీన్లకే 2 కోట్లు

0
384
Rajinikanth Robo 2.0 Audio Launch in Dubai
Rajinikanth Robo 2.0 Audio Launch in Dubai

ఒక మీడియం సినిమాకు అయ్యేంత ఖర్చుతో ‘2.0’ ఆడియో వేడుకను చేస్తున్నారు ఆ చిత్ర నిర్మాతలు. ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారట ఈ ఆడియో వేడుకకు. ఐతే అంత ఖర్చు ఎందుకవుతుంది అన్న సందేహాలు జనాల్లో ఉన్నాయి. కానీ ఈ ఆడియో వేడుకకు సంబంధించిన విశేషాలు వింటుంటే అదేమంత పెద్ద విషయం కాదనిపిస్తోంది. ఆడియో వేడుక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ స్క్రీన్ల కోసం ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేశారట. ఆ స్క్రీన్లు అంత హై క్వాలిటీతో ఉంటాయట. దీన్ని బట్టి మొత్తం ఆడియో ప్రాంగణాన్ని సిద్ధం చేయడానికి ఎంత ఖర్చు చేస్తున్నారో అంచనా వేయొచ్చు.

శుక్రవారం ఆడియో వేడుక నేపథ్యంలో ముందు రోజు దుబాయిలో ఒక ప్రెస్ మీట్ పెట్టింది చిత్ర బృందం. దానికే కోటి రూపాయల దాకా ఖర్చు చేశారట. వివిధ దేశాల నుంచి విలేకరుల్ని సొంత ఖర్చుతో విమానాల్లో తీసుకొచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టారట. వాళ్లందరికీ భారీ విందు కూడా ఏర్పాటు చేశారట. అందుకే అన్నమాట ఇంత ఖర్చు. ఈ లెక్కలన్నీ చూస్తే రూ.15 కోట్లు ఎందుకు ఖర్చువుతోందో అందరికీ ఒక ఐడియా వచ్చేస్తోంది. శుక్రవారం జరగబోయే ఆడియో వేడుకకు రానా దగ్గుబాటి యాంకర్ గా వ్యవహరించబోతుండటం విశేషం. అతను చిత్ర బృందంతో పాటే దుబాయికి చేరుకున్నాడు. రేపటి ఆడియో వేడుకను ఓ సరికొత్త కాన్సెప్ట్ ప్రకారం నడిపించడానికి అతను రిహార్సల్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ వేడుకకు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న సంగతి తెలిసిందే.