గురువుకు సూపర్ స్టార్ గౌరవం

0
380
Rajinikanth has built an Ashram near Babaji cave in the Himalayas
Rajinikanth has built an Ashram near Babaji cave in the Himalayas

సౌత్ లో తిరుగులేని ఇమేజ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సొంతం. వెండితెరపై ఆయన స్టైల్ ను ఆరాధించే అభిమానులు కోట్లలోనే ఉంటారు. కానీ రజనీ మాత్రం ఆడంబరాల కంటే ఆధ్మాత్మికతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. తరచూ హిమాలయాలకు వెళ్లి సాధువుల సహచర్యంలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతుంటారు.

తాజాగా రజనీ తన స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని కట్టించారు. ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద అనుచర శిష్యగణంలో రజనీ కూడా ఉన్నారు. అక్కడే పదిహేనేళ్ల క్రితం మరో ముగ్గురితో ఆయనకు పరిచయం ఏర్పడింది. పరమహంస యోగానంద స్థాపించిన యెగోదా సత్సంగ్ సొసైటీ ఆప్ ఇండియా శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన స్నేహితులతో కలిసి గురుశరణ్ పేరుతో ఆశ్రమ నిర్మాణం చేపట్టారని ఆయన స్నేహితుడైన న్యాయవాది వి.విశ్వనాథన్ చెప్పారు. ఈ ఆశ్రమం నవంబరు నుంచి భక్తులకు అందుబాటులోకి రానుందన్నారు.

రజనీకాంత్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం 2.0లో హీరోగా నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తుండగా బ్రిటిష్ అందం అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతోపాటు కబాలి దర్శకుడు పా.రంజిత్ డైరెక్షన్ లో కాలా సినిమా సైతం చిత్రీకరణలో ఉంది.