2009 లో సుమంత్ హీరోగా వచ్చిన బోణి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కృతి ఖర్బందా. అమ్మడు వచ్చిన కొత్తలో చాలా క్యూట్ గా కనిపించేది. కానీ ఛాన్సులు పెరిగిన కొద్దీ కొంచెం గ్లామర్ డోస్ ని పెంచింది. అయినా గాని స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోలేక పోయింది. ఫైనల్ గా విజయాలు అంతగా రాకపోయినా కష్టపడి పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకొంది.

2011 లో వచ్చిన తీన్ మార్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అమ్మడు ఆశలు అవిరయ్యాయి. కానీ ఏ మాత్రం నిరాశ చెందకుండా చిన్న పాత్రలు వచ్చినా సరే చేసుకుంటూ వెళ్లింది. మొన్నటి వరకు సౌత్ లో అంతగా పాపులర్ కానీ కృతి బాలీవుడ్ లో మాత్రం బాగానే ప్రయత్నాలను చేస్తోంది. అమ్మడు ప్రస్తుతం చేస్తోన్న షాదిమే జరూర్ ఆనా అనే సినిమాలోని ‘పల్లో లట్కే’ అనే పాట రిలిజ్ అయ్యింది.

పాటలో కృతి ఖర్బందా లుక్స్ చూస్తే ఎవ్వరికైనా సరే దిమ్మ తిరగాల్సిందే. ఏంటి మరి ఇలా అయిపోయింది అనకుండా ఉండలేరు. ఏ మాత్రం హద్దులు లేకుండా తన అందచందాలను దారబోసేసింది ఈ ఇన్నోసెంట్ లుక్కింగ్ సుందరి. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అమ్మడి రొమాన్స్ కూడా పాటలో బాగానే కనిపిస్తోంది. మరి ఆ పాట సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. అలాగే ఆమె కెరియర్ కు ఎంతవరకు ప్లస్ అవుతుందో కూడా చూడాలి.