అలా గిఫ్ట్ ఇచ్చినట్లు ఎవరు చెబుతారు?

0
334
No Clarity On Gifts Between Celebrities
No Clarity On Gifts Between Celebrities

ఇప్పుడు భలే ఇంట్రెస్టింగ్ డిబేట్ ఒకటి నడుస్తోందిలే. అదేంటంటే.. అసలు నిజంగానే అనుష్క వాచ్ ఇచ్చిందా? పవన్ కళ్యాణ్ ఉంగరం ఇచ్చాడా అంటున్నారు జనాలు. ఇంతకీ ఈ ఇవ్వడం ఏంటండీ బాబు అంటారా.. పదండి అదేంటో తెలుసుకుందాం.

మొన్నామధ్యన సమంత అండ్ నాగ చైతన్య పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఒక అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడంటూ టాక్ వచ్చింది. త్రివిక్రమ్ మరియు పవన్ కలసి రెండు డైమండ్ రింగులు ఈ కపుల్ కు ఇచ్చినట్లు అందరూ చెప్పుకున్నారు. కాని  విషయంపై అఫీషియల్ న్యూస్ ఏమీ లేదు. అలాగే ప్రభాస్ పుట్టినరోజుకు అనుష్క ఒక లగ్జరీ వాచ్ కొనిచ్చిందని కూడా టాక్ వచ్చింది. దాని గురించి కూడా ఎటువంటి న్యూస్ లేదు. అలాంటప్పుడు వీటిని నమ్మేదెలా అంటున్నారు కొందరు నెటిజన్లు.

నిజానికి సెలబ్రిటీలు ఎవరైనా కూడా ఇలాంటి గిఫ్టులు ఇచ్చినట్లు బయటపెడితే అసలు వాటికి అర్ధమేముంటుంది? అలా చెప్పినా తప్పే.. తీసుకున్నవారు తీసుకున్నట్లు చెప్పినా తప్పే. అందుకే వీటిని నమ్మినా నమ్మకపోయినా సాక్ష్యాలు కావాలనడం మాత్రం టూ మచ్ బాబు!!