నేనేమీ తలదూర్చట్లేదు -నిత్యా మీనన్

0
366
Nithya Menon Responds on Rumours on she Involvement in Script
Nithya Menon Responds on Rumours on she Involvement in Script

ప్రతి సినిమా ఇండస్ట్రిలో నిత్యం ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు. కొందరు రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటే.. మరి కొందరు పదేళ్లు ఉంటారు. ఆ తర్వాత ఊహించని విధంగా మాయమవుతారు.  కానీ చేసినవి కొన్ని సినిమాలే అయినా గుర్తుండే వారు మాత్రం చాలా తక్కువని చెప్పాలి. అటువంటి గుర్తింపు ఉన్న పాత్రలను ఎంచుకునే నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. అమ్మడు సౌత్ తెరలన్నిటిలో తనదైన శైలిలో పాత్రలను చేసి ఫెమస్ అయ్యింది.

అవసరమైతే తప్ప గ్లామర్ ని బయటపెట్టదు. అందులో కూడా చాలా లిమిట్స్ పెడుతుంది. అయితే గత కొంత కాలంగా అమ్మడు సినిమాలను ఎంచుకునే విషయంలో ఎక్కువగా రేవ్ రివ్యూస్ ఉన్న చిత్రాలనే ఒకే చేస్తోందట. ముఖ్యంగా గంగా సినిమా అలాగే రీసెంట్ గా వచ్చిన మెర్సల్  చిత్రాల పాత్ర ఎంపిక విషయంలో కూడా అదే ఆలోచిందట ఈ మలయాళీ భామ. అంతే కాకూండా తన పాత్ర విషయంలో స్క్రిప్ట్ విభాగంలో కూడా కలుగజేసుకుంటుందని కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి.

అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్య్వూలో నిత్యా ఆ విషయం పై స్పందించింది. అలాంటిదేమీ లేదు జస్ట్ సినిమా కంటెంట్.. అలాగే నా పాత్ర బావుంటేనే సినిమా చేస్తాను అంతే గాని ఎటువంటి విషయాల్లో తాను తలదూర్చనని చెప్పింది. ఇక ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. కానీ నన్ను మాత్రమే ఎంచుకున్నారంటే తన నటనను మెచ్చే అని నిత్యా క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం మూడు భాషల్లో తెరకెక్కుతోన్న ప్రాణ అనే సినిమాలో నటిస్తోంది. వీకే ప్రకాష్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.