ఖాన్ లే తనకు కరెక్ట్ అంటోందే?

0
262
Neethu Chandra Wants to Act With Khans
Neethu Chandra Wants to Act With Khans

హీరోయిన్ నీతు చంద్ర.. టాలీవుడ్ జనాలకు బాగానే తెలుసు. మంచు విష్ణు హీరోగా నటించిన విష్ణు మూవీతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. గోదావరి.. సత్యమేవ జయతే వంటి చిత్రాలలో కూడా నటించింది. అయితే.. ఆ తర్వాత బాలీవుడ్ కి జంప్ అయిపోయినా.. అడపా దడపా తెలుగు.. తమిళ్ లో నటిస్తూనే ఉంది.

గరమ్ మసాలా అంటూ ప్రియదర్శన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నీతు చంద్ర.. ట్రాఫిక్ సిగ్నల్.. రణ్ వంటి చిత్రాలతో ఆకట్టుకుంది కానీ.. తనకు సరైన స్థాయిలో అవకాశాలు రాలేదన్నది ఈ భామ భావన. ఎక్కువగా సినిమాలు చేయలేకపోవడానికి కారణం.. తన తండ్రి క్యాన్సర్ కు గురికావడంతో.. ఫ్యామిలీపై ఫోకస్ పెట్టాల్సి వచ్చిందట. అయితే.. తన ట్యాలెంట్ కు తగినట్లుగా ఛాన్సులు మాత్రం రాలేదంటున్న నీతు చంద్ర.. షారూక్ ఖాన్.. సల్మాన్ ఖాన్ సినిమాల్లో నటించాల్సిన రేంజ్ తనది అనేస్తోంది. కానీ తనకు గాడ్ ఫాదర్ లేకపోవడం.. సినీ వారసత్వం కాకపోవడంతో.. తనవరకూ ఆయా ఛాన్సులు రాలేదంటూ బోలెడంత ఫీలవుతున్న నీతు చంద్ర.. తనకు వచ్చిన అవకాశాల వరకూ బాగానే ఉపయోగించుకున్నట్లు చెబుతోంది.

తన కెరీర్ స్లోగా ఉన్నా.. స్టెడీగానే ఉందని సంతృప్తి వ్యక్తం  చేసిన ఈమె.. రీసెంట్ గా బంజారే అంటూ పాకిస్తానీ సింగర్ రహత్ ఫతే ఆలీ ఖాన్ పాడిన వీడియో సాంగ్ లో మెరిసింది.   ఇకపోతే ఈత కొలనుల పక్కన టూ పీస్ బట్టల్లో దర్శనమిస్తూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తోంది ఈ గోదావరి బ్యూటి.