నారా అబ్బాయికి నచ్చిందా? లేదా?

0
384
Nara Rohith Cameo in Venkatesh and Teja Movie
Nara Rohith Cameo in Venkatesh and Teja Movie

టాలీవుడ్ మల్టీస్టారర్ ధీరుడు విక్టర్ వెంకటేష్ చేసినట్టుగా ప్రయోగాలు ఎవ్వరు చేయారనే చెప్పాలి. టాలెంట్ ఉన్న దర్శకులను ఎంకరేజ్ చేస్తూ.. మల్టీస్టారర్ కథలను ఓకే చేస్తారాయన. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన ప్రయోగాలు చేసిన వెంకీ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడానికి రెడీ అయ్యాడు. గత కొన్ని రోజులుగా తేజ దర్శకత్వంలో ఒక సినిమాను వెంకీ చేయనున్నాడని వస్తున్న వార్తల గురించి తెలిసిందే.

అయితే ఈ సినిమా కాన్సెప్ట్ మల్టీస్టారర్ తరహాలో ఉంటుందట. అలాగే ఎంతో మంది హీరోలను మరో పాత్రకు అనుకున్నా చివరగా నారా వారబ్బాయి రోహిత్ ని ఒకే చేశారు. అయితే ఇందులో నారా రోహిత్ క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ గా ఉండనుందని టాక్. రోహిత్ కూడా ప్రయోగాత్మకమైన కథలను తెరకెక్కించడంలో ముందుంటాడు. వెంకటేష్ ఆ సినిమాలో లెక్చరర్ పాత్రలో కనిపించనున్నాడట. తేజ చెప్పిన కథపై వెంకటేష్ చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం నారా రోహిత్ హీరోగా అంతగా విజయాలు అందుకోకపోయినా ప్రయత్నాలు మాత్రం బాగానే చేస్తున్నాడు. ఏదైనా కొత్త అంశం ఉన్న కథలను మాత్రమే చేసుకుంటూ వస్తున్నాడు. మరి తేజ చెప్పిన కథలోని కొత్త అంశం నారా వారి అబ్బాయికి పూర్తిగా నచ్చిందా? లేదా? అనేది ఇంకా అధికారికంగా తెలియరాలేదు. సినిమాని మాత్రం త్వరలోనే స్టార్ట్ చెయ్యాలని వెంకీ అనుకుంటున్నాడట. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించనున్నారు.