సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వచ్చినప్పుడు చాలా రిజర్వుడుగా.. పొలైట్ గా ఉంటారు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా వీలైనంత వరకు దానిని ఎక్స్ ప్రెస్ చేయకుండా కవర్ చేయడానికే ప్రయత్నిస్తారు. హీరో నందమూరి బాలకృష్ణ వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నం. ఆయన బయట చాలా క్యాజువల్ గా కనిపిస్తుంటారు. ఇట్టే కోప్పడిపోతుంటారు.. ఆవేశపడుతుంటారు. ఇట్టే జోకులేస్తూ కనిపిస్తారు.

తాజాగా బాలకృష్ణ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో బాలయ్య  ఓ హోటల్ లో ఒక్కరే కూర్చుని ఫుడ్ తింటూ కనిపించారు. ఎటువంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్ గా.. ఓ సాధారణ వ్యక్తిలా ఆయన ఆహారం తీసుకుంటున్న వీడియో అభిమానులకు తెగ నచ్చేసింది. బాలయ్య సింప్లిసిటీకి ఇదీ నిదర్శనం  అంటూ కామెంట్లు జోడించి మరీ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు.. ఏ సందర్భంలో తీసిందనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

బాలకృష్ణ లేటెస్ట్ మూవీ పైసా వసూల్ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. తేడా సింగ్ అంటూ బాలయ్య తన నటనతో మెప్పించినా రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. దీంతో ప్రస్తుతం తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ చేస్తున్న సినిమాపైనే బాలయ్య దృష్టి పెట్టాడు. దీని తరవాత తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించనున్నాడు.