‘శైలజ’ మ్యాజిక్ రిపీటవుతుందా?

0
468
Kishore Tirumala on about Vunnadi Okate Zindagi Movie
Kishore Tirumala on about Vunnadi Okate Zindagi Movie

తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. రామ్ కథానాయకుడిగా ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన ఇమేజ్.. లుక్ కు సరిపోయే పాత్రలు ఎంచుకోకుండా మాస్ హీరో అయిపోదామన్న తాపత్రయంతో రామ్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాపై.. ఏం చేయాలో పాలుపోని సమయంలో ‘నేను శైలజ’తో అతడికి మంచి విజయాన్నందించాడు కిషోర్. ఆ సినిమాలో అందరికీ సరికొత్త రామ్ కనిపించాడు. రామ్ ఎలాంటి పాత్రలు చేస్తే బాగుంటుందో.. అందరికీ జనాలకు నచ్చుతాడో ఆ సినిమాతో అందరికీ అర్థమైంది.

కానీ రామ్ మాత్రం ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక మళ్లీ హైపర్ యాక్టివ్ పాత్ర చేశాడు ‘హైపర్’లో. దాని ఫలితమేంటో తెలిసిందే. ఐతే తన తప్పేంటో తెలుసుకుని మళ్లీ కిషోర్ దర్శకత్వంలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. ‘నేను శైలజ’ తరహాలోనే మరోసారి మంచి ఫీల్ ఉన్న సినిమా చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగింది. ‘నేను శైలజ’లో ప్రేమకు ఫ్యామిలీ ఎమోషన్లు జోడించి మెప్పించిన కిషోర్.. ఈసారి లవ్ స్టోరీకి ఫ్రెండ్ షిప్ స్టోరీని జత చేశాడు. ఈ కథలో స్నేహానికి కూడా ప్రాధాన్యం ఉంటుందట. హీరోయిన్లతో పాటు ఫ్రెండుగా శ్రీవిష్ణు పాత్ర కీలకమంటున్నారు. ఈ సినిమా గురించి చిత్ర బృందమంతా చాలా గొప్పగా చెప్పుకుంది. మరి అంత గొప్పగా సినిమా ఉంటుందా.. ‘నేను శైలజ’ మ్యాజిక్ రిపీటవుతుందా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.