మహేష్ 25 కోసం దేవి మొదలెట్టేశాడు

0
269
Devi Sri Prasad Starts Working For Mahesh Babu 25th Movie
Devi Sri Prasad Starts Working For Mahesh Babu 25th Movie

మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అను నేను’ కొన్ని నెలల కిందటే మొదలైంది. ఆ సినిమా వచ్చే ఏడాది మార్చికి పూర్తవుతుంది. ఏప్రిల్ నెలాఖర్లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దాని పాటల సంగతే ఇంకా ఏమీ తేలకపోగా.. మహేష్ దాని తర్వాత నటించబోయే కొత్త సినిమాకు అప్పుడే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టేశాడు దేవిశ్రీ ప్రసాద్.

ప్రస్తుతం దేవి అమెరికా పర్యటనలో ఉన్నాడు. అక్కడ అతడికి తోడుగా దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఉండటం విశేషం. వీళ్లిద్దరూ కలిసి న్యూయార్క్ వీధుల్లో విహరిస్తూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో.. ఓపెన్ ఏరియాలో మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టుకోవడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోలను స్వయంగా దేవీనే రిలీజ్ చేశాడు. మహేష్ 25వ సినిమా కోసమే ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ అని.

ఈ సినిమా స్క్రిప్టు అమేజింగ్.. ఇన్స్పైరింగ్ అని.. అందరికీ నచ్చుతుందని దేవిశ్రీ ట్వీట్ చేయడం విశేషం. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాతలు దిల్ రాజు అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం మహేష్ చేస్తున్న ‘భరత్ అను నేను’ సినిమాకు కూడా దేవీనే సంగీత దర్శకుడు. ఆ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే పూర్తయ్యాయట. ‘1 నేనొక్కడినే’తో తొలిసారి మహేష్ సినిమాకు పని చేసిన దేవి.. ఆ తర్వాత ‘శ్రీమంతుడు’కు అతడితో జత కట్టాడు. ఇప్పుడు వరుసగా సూపర్ స్టార్ తో రెండు సినిమాలకు పని చేస్తున్నాడు దేవి.