‘సైరా’ గురించి లేటెస్ట్ అప్ డేట్స్

0
445
Chiranjeevi Sye Raa Narasimha Reddy Shooting Starting Date
Chiranjeevi Sye Raa Narasimha Reddy Shooting Starting Date

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న సినిమా ‘సైరా.. నరసింహారెడ్డి’. ఈ ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా కన్ఫమ్ అయినప్పటికీ సెట్స్ మీదికి వెళ్లడానికి ఆలస్యమైంది. సినిమా ప్రారంభోత్సవం జరిగిన మూడు నెలలకు కూడా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కాలేదు. దీపావళి తర్వాత షూటింగ్ అనుకున్నారు కానీ.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఐతే డిసెంబరులో పక్కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుందన్నది తాజా సమాచారం. ఇందుకోసం సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. డిసెంబరు నుంచి పక్కాగా షెడ్యూళ్లు వేసుకుని చిత్రీకరణ మొదలుపెడతారట.

2019 సంక్రాంతికి ‘సైరా’ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్రణాళికలు రచించిందట రామ్ చరణ్-సురేందర్ రెడ్డి బృందం. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు రవివర్మన్ సినిమా నుంచి తప్పుకోవడం కూడా కొంతమేర ఆలస్యానికి కారణమైంది. చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’కి కెమెరామన్ గా వ్యవహరించిన రత్నవేలే ఈ సినిమాకు కూడా పని చేయబోతున్నాడు. ప్రస్తుతం అతడికి స్క్రిప్టు ప్రొడక్షన్ కు సంబంధించి బ్రీఫింగ్ నడుస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మాత్రం ఎ.ఆర్.రెహమానే కొనసాగనున్నాడు. ‘సైరా’కు ఒక కథానాయికగా నయనతార ఎంపికైంది. ఇంకో ఇద్దరు హీరోయిన్లను త్వరలోనే ఖరారు చేయనున్నారు. అమితాబ్ బచ్చన్.. జగపతిబాబు.. కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు.