మెగా స్మైల్ తో మెగా దంపతులు

0
389
Chiranjeevi Daughter Srija with Husband Kalyan
Chiranjeevi Daughter Srija with Husband Kalyan

తెరపై కనిపించకున్నా సరే సినీ తారల బందువులు సెలబ్రెటీ హోదాను సంపాదించుకుంటారు. ముఖ్యంగా సిని తారల పిల్లలు అయితే ఈ రోజుల్లో క్రేజ్ ని బాగానే అందుకుంటున్నారు.ఇక టాలీవుడ్ లో ఉండే మెగా హీరోల ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారిి కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది. వారి కుటుంబంలో ఎటువంటి సంబరాలు జరిగినా సోషల్ మీడియాలో హ్యాపీగా షేర్ చేసుకుంటారు.

అయితే ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. తన భర్త కళ్యాణ్ తో కలిసి దిగిన స్పెషల్ ఫొటోలని పోస్ట్ చేస్తోంది. కనిపించిన ప్రతి ఫొటోలో తన అందమైన ఆనంద జీవితం అనేలా స్టిల్స్ ఇస్తోంది. రీసెంట్ గా తన కుతురితో దిగిన ఫొటో కూడా అందరిని ఆకట్టుకుంది. భర్త కళ్యాణ్ ఆ పాప ని ఎత్తుకొని స్మైల్ ఇవ్వడంతో నెటీజన్స్ చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేశారు. ఇప్పటికి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

అదే విధంగా ఇప్పుడు శ్రీజ తన భర్త కళ్యాణ్ తో దిగిన మరో ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు స్మైల్స్ తో అదరగొట్టేసారు అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగా అల్లాడు కళ్యాణ్ కూడా త్వరలోనే హీరో అవ్వనున్నాడాని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ మెగా వారి ఇంట నుంచి మాత్రం అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు.