ఏప్రిల్ 27 న భరత్ వస్తున్నాడు!

0
443
Bharat Ane Nenu Movie Release Date
Bharat Ane Nenu Movie Release Date

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు – ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన స్పైడర్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించని సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మహేష్ అభిమానులను నిరుత్సాహపరిచింది. దీంతో కొరటాల శివ – మహేష్ ల కాంబోలో రాబోతున్న భరత్ అను నేను చిత్రంపై ప్రిన్స్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. స్పైడర్ ప్రమోషన్ పూర్తయిన వెంటనే మహేష్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అసెంబ్లీ నేపథ్యంలో జరిగే అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన సంగతి తెలిసిందే.

స్పైడర్ తో నిరాశచెందిన అభిమానులను అలరించేందుకు భరత్ ను త్వరగా విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత దానయ్య ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్ 27 న విడుదల చేయబోతున్నారని పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ విషయాన్ని చిత్ర యూనిట్ కన్ ఫర్మ్ చేసింది. సమ్మర్ సినిమాల రేసులో భరత్ ను నిలుపుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్నఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల-మహేష్ ల కాంబోలో వచ్చిన శ్రీమంతుడు తరహాలోనే ‘భరత్ అను నేను’ భారీ విజయాన్ని అందిస్తుందని ప్రిన్స్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మరోసారి ప్రేక్షకుల అంచనాలను కొరటాల అందుకుంటాడేమో వేచి చూడాలి.