భరత్-సూర్య ఒకేసారి బరిలోకి… వై?

0
239
Allu Arjun Naa Peru Surya Vs Mahesh Babu Bharat ane Nenu Movie
Allu Arjun Naa Peru Surya Vs Mahesh Babu Bharat ane Nenu Movie

స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలకు పెట్టిన పెట్టుబడి తిరిగి రావాలంటే మొదటి వారం రోజుల కలెక్షన్లే కీలకం. అందుకే వీలైనంత వరకు ఒకేవారం రెండు భారీ సినిమాలు ఏమీ లేకుండా నిర్మాతలు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దసరా – సంక్రాంతి లాంటి పండగలైతే సీజన్ కాబట్టి పోటీ ఉన్నా రెండు మూడు సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకొచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కానీ సీజన్ సంబంధం లేకుండా వచ్చే సమ్మర్ కు ఒకేసారి థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

ఇండస్ట్రీలో చాలాకాలంగా రైటర్ గా ఉన్న వక్కంతం వంశీ తొలిసారి డైరెక్టర్ అవకాశం దక్కించుకుని స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నాపేరు సూర్య సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు ముహూర్తం షాట్ తీసిన నాడే ఏప్రిల్ 27 నాటికి థియేటర్లకు తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఈ చిత్ర యూనిట్ కు భరత్ అనే నేను టీం నుంచి షాక్ ఎదురైంది. శ్రీమంతుడు లాంటి హిట్ కాంబినేషన్ తరవాత మహేష్ బాబు మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను కూడా ఏప్రిల్ 27కే థియేటర్లకు తీసుకురావడానికి నిర్ణయించారని తెలుస్తోంది.

ఈ నిర్ణయం అల్లు అర్జున్ సినిమా యూనిట్ కు ఏమాత్రం మింగుడుపడటం లేదట.  తాము ముందుగానే రిలీజ్ డేట్ ప్రకటించినా పట్టించుకోకుండా అదే రోజు సినిమా రిలీజ్ చేస్తామని చెప్పడం అనవసర పోటీకి తెరతీయడమేని ఫీలవుతున్నారు. ‘‘ఏదేమైనా నా పేరు సూర్య ఏప్రిల్ 27 నాటికి థియేటర్లలో ఉంటుంది. ఈ మాట ముందే చెప్పాం. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు.’’ అని నా పేరు సూర్య ప్రొడక్షన్ టీంలోని సభ్యుడొకరు క్లారిటీ ఇచ్చారు. మరి పోటీలో ఉండాలా.. డేట్ మార్చుకోవాలా అన్నది కొరటాల టీం నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.