బాహుబలి తర్వాతే బన్నీ దువ్వాడే

0
337
Allu Arjun Duvvada Jagannatham Movie TRP Ratings
Allu Arjun Duvvada Jagannatham Movie TRP Ratings

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అండతో ఎంట్రీ ఇచ్చినా కూడా అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే రీసెంట్ గా ఈ స్టార్ ఒక సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఎవరు ఊహించని విధంగా తన డీజే సినిమతో టీవీల్లో బాహుబలి కే గట్టి పోటీని ఇచ్చాడు. ఇంతవరకు ఏ సినిమా తెలుగులో బాహుబలి తో ఏ విధంగాను పోటీ పడలేదు.

కానీ బన్నీ మాత్రం TRP తో బాహుబలి 2 తో బాగానే పోరాటం చేశాడు. బుల్లి తెరపై మొదటి సారి ప్రదర్శిన్చబడిన ఆటలో బాహుబలి 1 – 23 TRP ని అందుకోగా.. బాహుబలి 2 – 22.7 అందుకుంది. ఇప్పటివరకు టాలీవుడ్ బుల్లితెరపై ఉన్న అత్యధిక రేటింగ్స్ ఇవే. 200 కోట్లతో తెరకెక్కి వెయ్యి కోట్లు కలెక్షన్స్ దాటించిన బాహుబలి 2 తన మొదటి పార్ట్ రేటింగ్ ని దాటడంలో కొద్దిగా వెనుకబడింది.

అయితే బన్నీ మాత్రం ఎవరు ఊహించని విధంగా తన గత చిత్రాలు సాధించని TRP లను సంపాదించాడు. ఈ నెల 14న జీ తెలుగులో ప్రసారం అయిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా కు 21.70 వచ్చింది. సాధారణంగా ఈ సినిమాపై ఎన్నో అనుమానాలు వివాదాలు చెలరేగినా ఈ స్థాయిలో రికార్డ్ క్రియేట్ చేసిందంటే గ్రేట్ మూవీ అని నెటిజన్స్ ప్రశంసలను కురిపిస్తున్నారు. ఫైనల్ గా బన్నీ బాహుబలి తర్వాత రేటింగ్ లో తన సినిమాను నిలబెట్టాడు.