ఆ పెళ్లిలో బచ్చన్ ఫ్యామిలీ సందడి

0
363
Aishwarya Rai Dances with Daughter Aaradhya and Bachchan Family
Aishwarya Rai Dances with Daughter Aaradhya and Bachchan Family

బాలీవుడ్ సెలబ్రిటీల్లో బోలెడంత ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ బిగ్ బి కుటుంబం. ఎక్కడ ఏ వేడుక జరిగినా ఈ సినీ కుటుంబ సభ్యులు సరికొత్తగా దర్శనం ఇస్తారు. అమితాబ్ బచ్చన్  వక్తిత్వాన్ని ఇష్టపడే సెలబ్రిటీలు బాలీవుడ్ లో చాలా మందే ఉన్నారు. అందుకే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఆయన కుటుంబాన్ని స్పెషల్ గా ఇన్వయిట్ చేస్తారు. రీసెంట్ గా ఓ సినీ ప్రముఖ వ్యక్తికి సంబంధించిన పెళ్లి వేడుకకు బిగ్ బి.. తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యారాయ్ కూడా సరికొత్త గెటప్స్ తో కనిపించారు. ఇక వారి గారాల కూతురు ఆరాధ్య కూడా సంప్రదాయంగా తలపై పూలు పెట్టుకొని మరి రెడీ అయ్యింది. ఇక ఈ వివాహ వేడుకలో ఐశ్వర్య – ఆరాధ్య.. బోలెడన్ని పాటలకు డ్యాన్సులు కూడా వేశారు. పెళ్లి మొత్తంలో బిగ్ బి ఫ్యామిలీ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక అమితాబ్ – అభిషేక్ షేర్వాణీల్లో తలపాగ ధరించి కనిపించారు. ఇక ఐశ్వర్యారాయ్ రెడ్ కలర్ శారీలో బోలెడంత అందంగా ఉండగా.. కూతురు ఆరాధ్య పింక్ కలర్ డ్రెస్ లో భలే క్యూట్ గా ఉంది.

వేడుకకు సంబంధించిన పోటోలను అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతే కాకుండా మాంచి క్యాప్షన్ కూడా పెట్టారాయన. ‘వధువుని ఇంట్లోకి ఆహ్వానించడానికి అందరినీ ఒకటి చేసే వేడుక పెళ్లి’ అన్నారు అమితాబ్.