బర్త్ డే బాహుబలితో సెల్ఫీ దిగేసింది

0
1005
Shraddha Kapoor Selfie with Prabhas
Shraddha Kapoor Selfie with Prabhas

బాహుబలి విజయ ప్రభావంతో బాలీవుడ్ సెలబ్రెటీలకు ప్రభాస్ ఫెవరెట్ హీరో అయ్యాడు. ప్రస్తుతం నేషనల్ మీడియా కూడా ప్రభాస్ నెక్స్ట్ సినిమాపై అనేక కథనాలను ప్రసారం చేస్తోంది. ఎటువంటి న్యూస్ వచ్చినా బాహుబలి బ్రేకింగ్ న్యూస్ అంటూ సాహో చిత్ర విశేషాలను చెబుతోంది. అయితే ఈ సినిమాతో ప్రభాస్ తన రెగ్యులర్ యాక్షన్ ఫార్మట్ లో హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు.

అయితే ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సాహో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే చిత్ర హీరోయిన్ శ్రద్దా కపూర్ కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో ప్రభాస్ ఫస్ట్ లుక్ ను షేర్ చేసింది. ఇక డార్లింగ్ ప్రభాస్ కి కూడా విషెస్ తెలిపింది. ఇక అమ్మడు ప్రభాస్ తో దిగిన మరో ఫొటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బాహుబలి ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని చెప్పిన శ్రద్దా – ప్రభాస్ పై చేయి వేసి ఫొటో దిగింది. అంతే కాకుండా ఆ ఫొటోలో దర్శకుడు సుజిత్ కూడా ఉన్నాడు.

ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే శ్రద్దా కపూర్ ఇలా బాహుబలితో సెల్ఫీ దిగేయడం చాలామంది హీరోయిన్లకు జెలసీ కలిగిస్తోందట. శ్రద్దా భలే లక్కీ ఫెలో అంటున్నారు వారు. కొందరేమో మాకెప్పుడు ఛాన్స్ వస్తుందా అంటూ వెయిట్ చేస్తున్నారు.