ఫోటో స్టోరి: ఆరెంజులో అందాల రాక్షసి

0
608
Lavanya Tripathi In Orange Outfit
Lavanya Tripathi In Orange Outfit

అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అందాల రాకాసి లావణ్య త్రిపాఠి. తన సొట్ట బుగ్గల నవ్వుతోనే ఇట్టే కుర్రకారును ఆకట్టుకునే ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హవాను బాగానే కొనసాగిస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేసేస్తోంది.  బలే బలే మగాడివోయ్ – సోగ్గాడే చిన్ని నాయన సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న అమ్మడికి ఆ తర్వాత వరుసగా అపజయాలు దక్కాయి.

ముఖ్యంగా మిస్టర్ – యుద్ధం శరణం సినిమాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ని అందుకుంది. అయినా లావణ్య ఏ మాత్రం నిరాశ చెందకుండా వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతోంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఒక ఫొటో షూట్ లో లావణ్య అందాలు చాలా వైరల్ అవుతున్నాయి.  ఆరెంజ్ ఈజ్ ద న్యూ బ్లాక్.. అంటూ అమ్మడు షేర్ చేసిన ఆ ఫోటోకి ప్రస్తుతం అనేక రకాల కామెంట్స్ అందుతున్నాయి. ఆరెంజ్ కలర్ డ్రెస్సులో సెక్సీ లుక్ భలే ఉందని సినీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ లుక్ లో లావణ్య ని చూస్తుంటే గతంలో రమ్యకృష్ణ ని చూసినట్టే ఉందని కూడా అంటున్నారు.

ఇకపోతే తన తాజా సినిమా ఉన్నది ఒకటే జిందగీ ప్రమోషన్లలో అమ్మడు తనకు లెహంగాలు ఓణీలు వేసుకుని చేస్తున్న రోల్స్ బోర్ కొట్టేశాయని.. వెస్ర్టన్ బట్టల్లో మెరిసే ఛాన్సులు కావాలని.. బికినీలు వేసుకోవడానికి కూడా తాను రెడీ అంటూ ఓపెన్ గానే చెప్పేసింది. ఈ ఫోటో షూట్ కూడా అందుకు ఇండికేషనే అనుకుంట!!