ప్రభాస్ కి ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చిన స్వీటీ

0
834
Anushka Shetty Birthday Gift to Prabhas
Anushka Shetty Birthday Gift to Prabhas

సాదారణంగా సినిమా హీరో హీరోయిన్స్ ఒక  సినిమాలో నాలుగు నెలలు ట్రావెల్ చేసి కలిసి నటిస్తేనే చాలా క్లోజ్ గా ఉంటారు. అలాంటిది ఒక సినిమాకు అయిదేళ్ళు కష్టపడి చేసిన నటీనటులు ఇంకెంత క్లోజ్ గా ఉండాలి. టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఇప్పుడు ఉన్నది ఎవరో కాదు. స్వీటీ అనుష్క అలాగే బాహుబలి ప్రభాస్. అంతకుముందు వీరు కలిసి నటించినా కూడా నార్మల్ గానే ఉండేవారు.

కానీ ఎప్పుడైతే బాహుబలి లో కలిసి నటించారో గాని అప్పటి నుండి ప్రాణ స్నేహితులు అయిపోయారు. ఎంతలా అంటే వీరి స్నేహాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకునే వరకు వచ్చింది. కానీ ప్రభాస్ మాత్రం అలాంటిదేమి లేదని చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు. ఇకపోతే ఈ రోజు ప్రభాస్ పుట్టినరోజు విషయం గురించి తెలిసిందే. సాహో చిత్ర బృందం ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసింది. ఇంకా కొందరు ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ ని అందించారు కానీ స్వీటీ అనుష్క మాత్రం మంచి గిఫ్ట్ ఇచ్చింది.

మంచి స్నేహితురాలిగా ప్రభాస్ ఇష్టాన్ని తెలుసుకొని అమ్మడు.. ప్రభాస్ కి డిజైనర్ వాచీలంటే చాలా ఇష్టమని.. ఎంతో ఇష్టంగా డిజైనర్ వాచీని బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యింది. స్వీటీ అనుష్క అందరిలా కాకుండా ప్రభాస్ ఇష్టాన్ని తెలుసుకొని గుర్తుండి పోయే బహుమతిని ఇవ్వడంతో టాలీవుడ్ లో అందరూ ఫిదా అయిపోతున్నారు.