దీపిక కూడా ఆ యాపారం మొదలెట్టేసింది

0
886
Deepika padukoni
Deepika padukoni

ఏదో సంస్థ తయారు చేసిన ఉత్పత్తులకు మనం ప్రచారకర్తగా ఉండటమేనా.. మనకంటూ ఓ బ్రాండ్ వద్దా అన్నట్లుగా బాలీవుడ్ తారలందరూ సొంతంగా దుస్తుల తయారీ సంస్థను మొదులపెట్టేసి వాటిని తామే ప్రచారం చేసుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ తాను నిర్వహించే స్వచ్ఛంద సంస్థ ‘బీయింగ్ హ్యూమన్’ పేరు మీదే దుస్తుల బ్రాండ్ మొదలు పెట్టేసి దాన్ని పాపులర్ చేసేశాడు.

అలాగే హృతిక్ రోషన్.. అనుష్క శర్మ.. సోనమ్ కపూర్.. ఇలా చాలామంది బాలీవుడ్ తారలు సొంతంగా క్లోతింగ్ బ్రాండ్స్ ఆరంభించారు. ఈ కోవలోకి ఇప్పుడు దీపికా పదుకొనే కూడా చేరిపోయింది. ఆమె ‘ఆల్ అబౌట్ యు’ పేరుతో దుస్తుల బ్రాడ్ మొదులపెట్టింది. ఈ-కామర్స్ పోర్టల్ ‘మైంత్రా’తో కలిసి దీపిక ఈ బ్రాండ్ ను లాంచ్ చేసింది. ఆ బ్రాండ్ డ్రెస్సులు వేసుకుని ఆల్రెడీ ఫొటో షూట్లు కూడా చేసేసింది. దీపిక ఫ్యాన్స్ ఈ బ్రాండును బాగానే ఇష్టపడుతున్నారట.

త్వరలోనే ‘పద్మావతి’గా పలకరించబోతున్న దీపికా.. ఆ సినిమాకు ప్రచారం చేస్తూనే పనిలో పనిగా తన దుస్తుల బ్రాండ్ ను కూడా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ వ్యాపారంలో దీపిక ఎంత వరకు విజయవంతమవుతుందో చూడాలి. ఇక డిసెంబరు 1న విడుదలకు సిద్ధమవుతున్న ‘పద్మావతి’.. రిలీజ్ ముంగిట కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళన జరుగుతున్నాయి. ఈ అడ్డంకుల్ని ఈ చిత్రం ఎలా అధిగమించి అనుకున్న ప్రకారం విడుదలవుతుందో చూడాలి.