కేబీసీ వల్ల మెగాస్టార్ కు తిప్పలు

0
780
KBC 9 takes a toll over host Amitabh Bachchan health
KBC 9 takes a toll over host Amitabh Bachchan health

ప్రస్తుతం దేశంలో అత్యంత ఆదరణ పొందిన షోలలో కౌన్ బనేగా కరోడ్పతి (కేబీసీ) ఒకటి. అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో నార్త్ లో చాలా పాపులర్ అయ్యింది. అంతే కాకుండా సౌత్ లో కూడా ఈ షోను పలు హీరోలు చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్టార్స్ బుల్లి తెరపై ఇలాంటి రియాలిటీ షోలతో చాలా పాపులర్ అవుతున్నారు.

కానీ ఇలాంటి రియాలిటీ షోలను చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. స్టార్స్ కూడా చాలా కష్టపడతారు. అయితే  కౌన్ బనేగా కరోడ్ పతి కోసం మాత్రం తన ఆరోగ్యం చాలా దెబ్బతిందని షో వ్యాఖ్యాత మెగాస్టార్ అమితాబ్ బ్లాగ్ ద్వారా తెలిపాడు. ప్రస్తుతం 9వ సీజన్ కొన్ని రోజుల్లో ఎండ్ అవ్వబోతోంది. ఈ సందర్భంగా బిగ్ బి తన మనసులోని మాటను చెప్పుకున్నారు.  ఈ షో ద్వారా నేను ప్రజలకు మరింత దగ్గరయ్యాను. రాత్రి తొమ్మిది గంటలకు ప్రసారం అయ్యే షో కోసం ఎంతో ఎదురు చూస్తారు. కానీ కొన్ని నెలలవరకు ఆ ఎదురుచూపులు ఉండకపోవచ్చు.

నిజంగా చెప్పాలంటే.. షోలో బాగస్వామ్యులైన అందరికి ఇదొక చేదువార్తే. బాధగా ఉండవచ్చు. దాదాపు నెల రోజుల పాటు ఎంతో మంది కష్టపడ్డారు. అయితే షో ద్వారా నా స్వర పేటిక కూడా చాలా దెబ్బతిందని అమితాబ్ వివరించారు. అలాగే ఫైనల్ లో ఆరోగ్యం కుదురుగా ఉండడం కోసం పెయిన్ కిల్లర్స్ – యాంటీ బయోటిక్స్ తీసుకుంటున్నాని ఆయన తెలిపారు. ప్రస్తుతం అమితాబ్ – థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అలాగే 102 నాటౌట్ అనే సినిమాల్లో నటిస్తున్నారు. అదే విధంగా డిసెంబర్ లో స్టార్ట్ అయ్యే సైరా సినిమా షూటింగ్ లో కూడా అమితాబ్ పాల్గొననున్నారు.