కాదని అనంగాని.. కానట్టే…

0
681
Prabhas
Prabhas

అయితే అవుతుందని చెప్పాలి. కాకుంటే కాదని చెప్పాలి. నిష్ఠూరంగా అనిపించినా నిజమే చెప్పాలి. ఇవన్నీ బయట ప్రపంచానికి సూట్ అవుతాయేమో కానీ సినిమా ఇండస్ట్రీలో ఆబ్లిగేషన్లు ఎక్కువ. మొహమాటాలు ఎక్కువే. ఆఫర్ క్రేజీ అనిపించినప్పుడు ఎస్ చెప్పడం తేలికే. అదే నో చెప్పాలన్నా… నేను చెయ్యను అని తెగేసి చెప్పాలన్నా కుదరని పరిస్థితి. మరలాంటప్పుడు కాదు అనే మాట చెప్పకుండా ఇంకేవో మాటలు చెప్పి సిట్యుయేషన్ ను దాటేయ్యాలి. ఇలా దాటేయడంలో ఒక్కోళ్లది ఒక్కో స్టయిల్.

టాలీవుడ్ బాహుబలి ప్రభాస్ తనకు చేయాలని అనిపించని  స్క్రిప్ట్ ముందుకొస్తే కళ్లు తిరిగే రెమ్యునరేషన్ అడుగుతాడని టాక్. ఈమధ్య బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్  సినిమా విషయంలో ఇదే ట్రిక్ ప్లే చేశాడని టాక్.  కథ చెబుతున్నప్పుడు అది మనకు సూటవదని మధ్యలోనే తెలిసిపోతుంది. అలాంటప్పుడు మొత్తం విని ఆ క్యారెక్టర్ సూట్ కాదనే మాట సున్నితంగా చెప్పేస్తామంటున్నారు హీరోలు రవితేజ అండ్ రామ్.

అదే హీరోయిన్లకయితే కొన్ని స్టాండర్డ్ డైలాగులుంటాయి. అవి వాళ్ల నోటి నుంచొస్తే ఇంక వాళ్లు ఆ మూవీ చెయ్యరనే అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్ చందమామ కాజల్ డేట్లు ఖాళీ లేవనో.. సినిమా చేసే ఉద్దేశంలో లేనని చెప్పేస్తుంది. లావణ్య త్రిపాఠి బల్క్ డేట్స్ లేవనే మాట వాడేస్తుంది. రకుల్ అయితే స్టోరీతో కనెక్ట్ అవలేకపోతున్నాననే మాట వాడుతుందట. మిల్కీబ్యూటీ అయితే ఇప్పుడు కాదుకానీ ఇంకోసారి స్టోరీని డిస్కస్ చేయాలని చెబుతుందట. అంతే.. అక్కడితో అర్ధం చేసుకోవాల్సిందే. అంతేమరి… ఇండస్ట్రీలో కొన్ని మాటలకు అర్ధాలే వేరు. అర్ధం చేసుకోండి.