ఐటం సాంగులో బాలకృష్ణ హీరోయిన్

0
668
Kyra Dutt
Kyra Dutt

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ రేసుగుర్రంలో బూచాడే బూచాడే అంటూ కైపెక్కించే డ్యాన్సుతో అందరి మతి పోగొట్టిన బెంగాలీ సుందరి కైరాదత్. ఆ ఐటం సాంగ్ సూపర్ హిట్టయినా తిరిగి తెలుగు వైపు పెద్దగా తలెత్తి చూడలేదు. తర్వాత బాలీవుడ్  మూవీ క్యాలెండర్ గర్ల్స్ లో లీడ్ రోల్ చేసింది. చాలా గ్యాప్ తరవాత తెలుగులో బాలకృష్ణ పక్కన పైసావసూల్ సినిమాలో కనిపించింది.

ఈసారి షార్ట్ టైం గ్యాప్ లోనే కైరా దత్ తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. ఈసారి ఓ మీడియం బడ్జెట్ మూవీ ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఆశిష్ రాజ్ హీరోగా తెరకెక్కుతున్న ఇగో సినిమాలో కైరా ఐటంసాంగ్ లో ఆడిపాడనుంది. గోదావరి జిల్లాల్లోని  విలేజ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ సాగుతుంది. ఇప్పుడు కైరాతో తీయబోయే పాట కూడా రాజమండ్రిలోనే చిత్రీకరించనున్నామని యూనిట్ చెబుతోంది. ఈ సినిమాలో సిమ్రన్ అనే కొత్త అందం తెలుగు తెరకు పరిచయం అవనుంది. సుబ్రహ్మణ్యం ఈ సినిమాకు దర్శకుడు.

కైరాదత్ చేసిన బూచాడే బూచాడే పాటలో ఆమె డ్యాన్స్ చూసి తెగ ఇంప్రెస్ అవడంతోనే పూరి జగన్నాథ్ కోరి ఆమెకు పైసా వసూల్ లో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే పైసా వసూల్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అమ్మడి కష్టం వృథా అయిపోయింది. ఇప్పుడు చేస్తున్న ఐటం సాంగ్ ప్రేక్షకులకు నచ్చితే కైరాకు ముందుముందు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం.